చెరువు శిఖము భూమిలో పశుగ్రాస పెంపకము
ఇటువంటి పశుగ్రాస కొరతలను అధిగమించడానికి సమగ్ర పశుగ్రాస పెంపక పద్దతులను అవలంభిచడం అవసరం.
గ్రామ కమిటీల ఆద్వర్యంలో,
గ్రామీణ
ప్రాంతాల రైతులందరు కలిసి చెరువు శిఖమునందు ప్రణాళిక
బద్దంగా సాముహిక పశుగ్రాస పెంచుకొని మండుటెండల్లొ కూడా పచ్చని పశుగ్రాసమును పశువులకు అందించవచ్చు.
చెరువు శిఖములో పెంచుటకు అనువైన పశుగ్రాసాలు :
·
చెరువు శిఖము సాగును ముఖ్యముగా మనము
ఎండాకాలము నందు
చేపడతాము, కాబట్టి స్వల్పకాలంలో ఎదిగే రకాలైన ఎస్.ఎస్.జి., జోన్న, జనుము మరియు పప్పు జాతి రకాలు వేయడము శ్రేయస్కరము.
·
శిఖము అంచున రక్షణకై కంచె బదులుగా దడి చెట్లుగా సుబాబుల్, అవిసె, దిరిసెన వంటి
చెట్లను నాటడం వలన రక్షణ ఇవ్వడమే కాకుండా, వాటినుండి వచ్చే కొమ్మలను కూడా పశుగ్రాసముగా వాడవచ్చు.
·
శిఖము పరిది ఎక్కువగా ఉన్న చెరువు యందు బహువార్షికాలైన ఎ.పి.బి.యన్,కో-1, 2, 3 లను నాటడము వలన ఎండాకాలమే కాకుండా ఎప్పటికీ పశుగ్రాసము లభించును (చెరువు నిండిన సమయము కాకుండా).
·
సాధారణంగా చెరువు శిఖము పశుగ్రాస పెంపకము ఒక
సాముహిక కార్యక్రమముగా పెంచుతాము కావున సాముహిక గడ్డి కత్తిరించు యంత్రంతో గడ్డి ముక్కలుగా కత్తిరించి పెట్టడము వలన
పశువులు ఎక్కువగా తినగలుగుతాయి.
·
శిఖమునందు ఎక్కువగా ఉత్పత్తి అయిన గడ్డిని సైలేజి లేదా ఎండు గడ్డి తయారికి కూడా వాడవచ్చు.
·
చెరువు శిఖము గడ్డి పెంపకంలో భాగంగా చెరువు అంచున ముఖ్య కలుపు మొక్కలయిన రబ్బరు చెట్లు,
రేఖసలేంద్ర చెట్లను తీసివేయడము వలన కాలుష్య నివారణే కాకుండ వర్షాకాలమందు చేపల పెంపకమునకు చెరువు సజావుగా ఉంటుంది.
చెరువు శిఖము పశుగ్రాస పెంపక ప్రయోజనాలు:
·
చెరువు శిఖంలో
సహజసిద్ధమైన తేమ ఉండుటవల్ల నీటి అవసరం లేకుండా పశుగ్రాసాలు
పెరుగుతాయి.
·
భూమిని గడ్డి పెంపకము కోసము ప్రత్యేకముగా కొనుగోలు చేయవలసిన అవసరము లేదు.
·
శిఖము భూమి సాదారణముగానే ఒండ్రుమట్టితో నిండి సారవంతమైనదై ఉండుట వలన గడ్డి ఎదుగుదల వేగంగా ఉంటుంది.
అలాగే ప్రత్యేకంగా ఎరువులు వేయవలసిన అవసరము ఉండదు.
·
ఇలాంటి ఒక సాముహిక కార్యక్రమము వలన
రైతుల మద్య సమన్వయం, సామరస్యం పెరుగుతాయి.
ప్రతిబంధకాలు:
·
జొన్న జాతి పశుగ్రాసాలను వేసినపుడు చెరువు శిఖమునకు కంచె లేనియడల, పశువులు లేత
పశుగ్రాసం తిన్నచో సైనైడ్ పాయిసనింగ్ (నామ చేయడం)కి అవకాశం ఉండును.
·
శిఖము చుట్టు కంచె
వేయడము కష్టసాద్యము.
·
సాముహిక పశుగ్రాస పెంపక పద్దతి కావున వివిద గ్రూపుల మద్య
సామరస్యపూరిత వాతావరణము కల్పించడము పెద్ద సమస్య.
పెరిగిన వ్యవసాయ క్షేత్రాల కారణంగా గడ్డి కొరత గణనీయంగా ఉన్న ప్రాంతాలలో, ఎండాకాలము మరియు కరువు కాలము వంటి పశుగ్రాస ఎద్దడి సమయాలలో చెరువు శిఖము భూమిలో పశు గ్రాస పెంపకము ఒక వరము లాంటిది. ఈ విధముగానైనా గణనీయంగా తగ్గిపోతున్న పాడిపశువులను కొంత వరకు కాపాడుకోగలము.
· డా.టి.పార్థసారథి, యమ్.వి.యస్సి
- డా.జె.రాజు, పి.హెచ్.డి.







.jpg)
No comments:
Post a Comment