Thursday, January 11, 2024

National Livestock Mission


నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాలు

రైతుల ఆదాయం పెంచేందుకు నిరుద్యోగులకు ఉపాధి ఏర్పరచాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ గ్రామీణ స్థాయిలో పశుపోషణ ద్వారా ఆర్థిక పురోగతి కొరకు జాతీయ లైన్ స్టాక్ మిషన్ నిధులతో 2021-22 నుండి 2025-26 సంవత్సరాల కాలంలో ఔత్సాహిక రైతులను పశుపోషణ వ్యాపారంలో ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టారు.

 ఈ పథకంలో గొర్రెలు మేకలు, కోళ్ల, పందుల పెంపకం, పశుగ్రాస దాణా తయారీలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అసంఘటితంగా ఉన్న పశుసంవర్ధక రంగాన్ని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకువచ్చి పాలు, గుడ్లు మరియు మాంసం ఉత్పత్తిని పెంచి వారికి సరైన మార్కెటింగ్ సౌకర్యాలు, గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచటం ద్వారా గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తోంది.

 నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా గరిష్టంగా కోటి రూపాయల విలువైన యూనిట్లను 50 శాతం రాయితీపై మంజూరు చేస్తుంది. కోళ్లతో పాటు గొర్రెలు, మేకలు, పందుల పెంపకానికి ఆసక్తి అర్హులైన వారికి కావాల్సిన సహాయం అందిస్తోంది. సైలేజి తయారీ యూనిట్, సమీకృత దాణా ఏర్పాటు చేయడం జరుగుతుంది.  కోటి రూపాయలు మొదలుకొని అంతకుమించి ప్రాజెక్టు విలువ ఉన్నచో గరిష్టంగా 50 లక్షల రూపాయల రాయితీ మంజూరు చేయబడును. అంతకన్నా తక్కువ ఉన్నచో ప్రాజెక్టు విలువలో 50% రాయితీ మంజూరు చేయబడుతుంది.

 నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ స్థాయిలో పశు ఉత్పత్తులైన పాలు మాంసం మరియు గుడ్ల ఉత్పత్తిని పెంచుకొని అధిక ఆదాయం పొందడం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పించి సుస్థిరతను ఆత్మ నిర్భరతను సాధించవచ్చు .

నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాలు:

పునర్వ్యవస్థీకరించబడిన జాతీయ లైవ్‌స్టాక్ మిషన్ క్రింది మూడు ఉప మిషన్లను కలిగి ఉంటుంది:

(ఎ) పశువులు మరియు పౌల్ట్రీ యొక్క బ్రీడ్ డెవలప్‌మెంట్‌పై సబ్-మిషన్

(బి) ఫీడ్ మరియు ఫీడర్ డెవలప్‌మెంట్‌పై సబ్ మిషన్

(సి) ఇన్నోవేషన్ మరియు ఎక్స్‌టెన్షన్‌పై సబ్ మిషన్


For  *Livestock (Cattle, Sheep, Goat, Swine & Poultry) enterprise, Detailed Project Reports ( DPR) for NLM, PMEGP, NDDB & for any other bankable loans contact  Dr.T.Parthasarathi, M.V.Sc. (Livestock Production Management), Veterinary Assistant Surgeon, Ph.No. 9701518135.


With DSCR, IRR, and repayment schedule DPR is in full shape # and ready to submit to bankers with Viable financial statements.



 

National Livestock Mission

నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాలు రైతుల ఆదాయం పెంచేందుకు నిరుద్యోగులకు ఉపాధి ఏర్పరచాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ప...