Showing posts with label సన్న కారు రైతులకు. Show all posts
Showing posts with label సన్న కారు రైతులకు. Show all posts

Tuesday, March 29, 2022

సన్న కారు రైతులకు, ప్లాస్టిక్ సంచులలో పాతరగడ్డి (సైలేజి) తయారి

 సన్న కారు రైతులకు, ప్లాస్టిక్ సంచులలో పాతరగడ్డి (సైలేజి) తయారి



పశుగ్రాస ఎద్దడిని అదిగామించడానికి వర్షాకాలంలో అధిక మొత్తంములో లభించే గ్రాసాన్ని దాని పోషక విలువలు తగ్గకుండానిల్వచేసేపద్దతియే పాతర గడ్డి (సైలేజి). సైలేజి ద్వారా కరువు సమయంలో పశుగ్రాసాన్ని సరైన రూపంలోఅందించవచ్చు. సైలేజి/పాతరగడ్డి అనునది తగిన తేమ శాతంము గల పచ్చిపశుగ్రాసాన్ని ముక్కలుగా కత్తిరించి వాయురహితపరిస్థితులలోకిణ్వన ప్రక్రియ ద్వారా భద్రపరిచడమే కాకుండా, రుచికరమైన పశుగ్రాసాన్ని కరువు సమయాలలో అందించవచ్చు.

            


 



అనువైన పంటలు:

జొన్న, మొక్క జొన్న, సజ్జలు, బహు వార్షిక పశుగ్రాసాలలో హైబ్రిడ్ నేపియర్, గిని, పారా ముఖ్యమైనవి. కాయ జాతి పశుగ్రాసలైన బర్సీం, లుసర్న్ లకు సరియైనమోతాదులో గడ్డి జాతి పశుగ్రాసలని కలపాలి. వరిగడ్డి మరియుబార్సిం సరియైన ఎంపిక.

 


తయారీ పద్దతి:

పశుగ్రాసాన్ని ముక్కలుగా నరికి 60-70% తేమ ఉన్నపుడే సైలేజి గుంతలలో గాని, ప్లాస్టిక్ సంచులలో గాని పొరలుపొరలుగా గాలి లేకుండా అదిమి, చివరిగా వాయురహితముగా ఉండే విధముగా, గాలి చొరబడకుండా కప్పువేయాలి. పశుగ్రాసాన్నిపొరలుగా వేస్తున్నప్పుడు మోలాసెస్ (@40-50 కి.గ్రా/టన్ను పప్పు జాతి పశుగ్రాసానికి), ఉప్పు (@18కి.గ్రా/టన్ను), సోడియం మెటా బైసల్ఫేట్ (@5కి.గ్రా/టన్ను), అసిటిక్ ఆసిడ్(@10లీటర్/టన్ను) మరియు ఫాస్ఫారిక్ ఆసిడ్(@6కి.గ్రా/టన్ను) కలపడం ద్వారా లాక్టిక్ ఆసిడ్ ఉత్పత్తి చేసే బాక్టీరియా పెరగడానికి దోహదపడటమే కాకుండా హాని కలిగించే బాక్టీరియాని నియంత్రిస్తాయి. మంచి నాణ్యమైన సైలేజి పసుపు పచ్చని రంగులో, మంచి వెనిగర్ వాసనలోఉంటుంది. ఇది పశువుకు తినడానికి రుచికరముగా ఉంటుంది.

సాంప్రదాయపద్దతి:

సాంప్రదాయ పద్దతిలో నేలలో గుంతలు తవ్వి ముక్కలుగా చేసిన గ్రాసాన్ని పొరలుగా అదిమి భద్రపరచాలి. కాని ఈ పద్దతిలో గుంత తవ్వడము, ట్రాక్టరుతో అదమడము ఒక సన్నకారు రైతుకి ఆర్దికముగా మరియు శ్రమతో కూడుకున్న పని.

ఈ పద్దతిలో తయారుచేసిన సైలేజిని పశువు వద్దకు తీసుకేల్లడం, తయారికి అయ్యే వ్యయం, కూలీలు ప్రధాన సమస్యలు. అదేకాకుండా గుంత భూమిలోఉండడం వాలన మట్టి, ఇతర వ్యర్ద పదార్థాలు, వర్షపునీరు వచ్చికలిసి కలుషితము అయ్యే అవకాశము ఎక్కువగా ఉండును. ఒకసారి తెరచిన గుంతని తక్కువ వ్యవదిలో ఉపయోగించుకోవలసి ఉంటుంది. ఈ కారణములతో పాతర గడ్డి పద్దతికి మనుగడ తక్కువైంది.

                   




ప్లాస్టిక్ సంచులలో సైలేజి తయారీ:

ఈ పద్దతిన మనకు అనుకూలమైన సైజులున్నప్లాస్టిక్ సంచులను ఎంపిక చేసుకొని, వాటిలో తగిన మోతాదులో సైలేజి తయారు  చేయవచ్చు. ముక్కలుగా చేసిన గడ్డిని, ప్లాస్టిక్ సంచిలో నింపి, గాలి చొరబడకుండా ఆదిమి మూతికట్టు కట్టాలి. 75 రోజుల తరువాత తెరచి పశుగ్రాసంగా వాడవచ్చు. 100కి.గ్రా సంచి 5-10 పశువులకి ఒక రోజు దాణాగా పనిచేస్తుంది.

    





    

ప్రయోజనాలు:

Ø  తయారికి అయ్యే ఖర్చు, అవసరమయ్యే స్థలం చాలా తక్కువ మరియు పశుగ్రాసన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచవచ్చు.

Ø  పశుగ్రాస వృదాని నివారించి, అందులోని పోశాకాలని నిల్వ ఉంచవచ్చు. తేమని కాపాడే శాతం ఎక్కువ.

Ø  పశుగ్రాసాన్ని కరవు సమయంలో వాడుకోవచ్చు.

పై కారణముల దృష్ట్యా సన్నకారురైతులకి అనువైన విదముగా, ప్లాస్టిక్ సంచులలో పాతరగడ్డి తయారీ శ్రేయస్కరం, లాభదాయకం, సులభం. పశుగ్రాస ఎద్దడి సమయాలలో పశుగ్రాస కొరతని అడిగామించడానికి ఇలాంటి నిల్వ చేయుపద్దతుల ఆవాసరం ఉంది.

·         డా.పార్థసారథి, యమ్.వి.యస్సి, 

·         డా.రాజు, యమ్.వి.యస్సి, 

National Livestock Mission

నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాలు రైతుల ఆదాయం పెంచేందుకు నిరుద్యోగులకు ఉపాధి ఏర్పరచాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ప...