Showing posts with label poultry waste management. Show all posts
Showing posts with label poultry waste management. Show all posts

Tuesday, March 29, 2022

పౌల్ట్రీ వ్యర్ధాల నుండి బయోడీజిల్ ఉత్పత్తి

                                         

పౌల్ట్రీ వ్యర్ధాల పడవేయడం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతున్నది. పౌల్ట్రీ ఫారాలలోని  చనిపోయిన పక్షుల మృతకళేభారాలను అశాస్త్రీయ పద్దతిలో పడేయడం వలన భూగర్భ మరియు ఉపరితల జల వనరులు కలుషితమయి విపరీతమైన దుర్వాసనను వెదజల్లుతాయి, ఈ ప్రదేశాలలో  దోమలు, ఈగలు వృద్ధి చెంది  అనేక రకాల వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. చికెన్ షాపులోని వ్యర్ధాలను సరియైన విధముగా  పడవేయకపోవడము వల్ల కుక్కల బెడద, పారిశుధ్య  సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ ఈ సమస్యలకు కారణమవుతున్న పౌల్ట్రీ వ్యర్ధాన్ని వనరుగామార్చుకొని బయోడీజిల్ ఉత్పత్తి చేసుకోవచ్చు.

ఆధునీకరణలో బాగంగా  పెట్రో ఉత్పత్తుల వినియోగం విపరీతంగాపెరిగింది. కానీ మన దేశంలో ప్రపంచంలోఉన్న ఆయిల్ వనరులలో 0.5% మాత్రమే  ఉన్నాయి. ఫలితంగా 75% క్రూడ్ఆయిల్ని  భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. ఆయిల్ ఉత్పత్తులను అధికంగా వాడటం వల్ల వాతావరణ కాలుష్యం, భూతాపం పెరగడం మరియు వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. మనదేశంలో పెట్రోల్ కన్నా డీజిల్ వినియోగం ఐదు రెట్లు ఎక్కువ. ప్రభుత్వం వీటి ధర తగ్గించడానికి రాయితీ ఇవ్వడం వల్ల దేశ ఆర్ధికాభివృద్ధిపై భారం పడుతుంది.

 

ఈ తరుణంలో జంతువుల కొవ్వు నుండి తయారు చేసే బయోడీజిల్ ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఈ శాస్రియ పద్ధతి వంట నూనెలను జంతువుల కొవ్వు నుండి చేసిన నూనే తో కలిపే కల్తీని కూడా నివారించవచ్చు.

బయోడీజిల్ అంటే ఏమిటి......?

బయోడీజిల్ అనగా పునరుత్పాదక కొవ్వు ముడిపదార్థలయిన కూరగాయల నూనే, జంతువుల కొవ్వు నుండి ఉద్భవించిన మోనో ఆల్కైల్ దీర్ఘ గొలుసు కొవ్వు ఆమ్లాల ఎస్టర్ లు. ఇవి కుదింపు జ్వలన లో ఉపయోగం కోసం (డీజిల్) వాడటానికి ఉపయోగమైనవి.

బయోడీజిల్ ప్రాముఖ్యత

·         బయోడీజిల్ పెట్రోల్ కంటే కూడా మంచి ఇంధన గుణాలని కలిగి ఉంటుంది. 10% ఆక్సిజన్ మిళితమై ఉండటం వల్ల  ఇంధనం పూర్తిగా దగ్ధమవడానికి ఉపయోగపడుతుంది. ఇంధనం దగ్ధమయ్యే సామర్థ్యం చూసినట్టయితే సేటేన్ సంఖ్య పెట్రోల్ కి 54.4  కాగా పౌల్ట్రీ వ్యర్ధం నుండి తీసిన బయోడీజిల్ కు 72.5.

·         బయోడీజిల్ ను మంచి కందెనలుగా కూడా వాడవచ్చు.

·         బయోడీజిల్ మండేటప్పుడు వచ్చే పొగలో మసి గాని, కాలుష్య కారక వాయువులుగాని చాలా తక్కువ. సల్ఫర్ దాదాపు శూన్యం, కార్బన్ మోనాక్సైడ్, కాలని హైడ్రోకార్బన్లు, నలుసు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి.

పౌల్ట్రీ వ్యర్ధాలే ముడి సరుకు

మరణించిన మొత్తం కోడిని మరియు చికెన్ షాపు వ్యర్ధాల నుండి తీసిన కొవ్వులు మరియు నూనెలు తిరిగి ఉపయోగించవచ్చు. 1.25 కిలోల సగటు శరీర బరువు కలిగిన చనిపోయిన కోడి 14.55 శాతం కొవ్వును కలిగి ఉంటుంది. ద్రావణి వెలికితీత పద్ధతి ద్వారా 96.1 శాతం కొవ్వు తిరిగి పొందవచ్చు.

 

తయారు చేయడం ఎలా...............?

పౌల్ట్రీ వ్యర్ధాల నుండి బయోడీజిల్ రెండు పద్దతుల ద్వారా తయారి చేయవచ్చు.

01.   ద్రావకం నుంచి సంగ్రహించడం పద్ధతి : ఈ పద్దతిలో బయోడీజిల్ తయారికి రెండు దశలు ఉంటాయి.మెదటి దశలో ఉచిత కొవ్వు ఆమ్లాలని ఆమ్ల ఉత్ప్రేరణ ద్వారా ఎస్తేరిఫికేషణ్ చేయడం. రెండవ దశలో ట్రైగ్లిజరైడ్స్ ని బేస్ ఉత్ప్రేరణతో ట్రాన్సెస్టెరిఫికేషన్ చేయడం ద్వారా కొవ్వు నుండి 97.62 శాతం మంచి నాణ్యత గల బయోడీజిల్ ను తయారు చేయవచ్చు.  ఈ పద్దతిలో ఒక లీటరు బయోడీజిల్ తయారు చేయడానికి 6 పక్షుల మృతకలేబరాలు అవసరమవుతాయి. ఈ విధముగా పౌల్ట్రీ వ్యర్ధాల నుండి తయారు చేసిన బయోడీజిల్ ఒక లీటరుకు రూ.22.00 ఖర్చు అవుతుంది.

02.   అపకేంద్ర పద్ధతి:  అపకేంద్ర బలాన్ని ఉపయోగించి బయోడీజిల్ ను యంత్రం ద్వారా వేరు చేస్తారు. 63% కొవ్వును  వేరుచేయడం సాధ్యమవుతుంది. ఈ పద్దతిలో ఒక లీటరు బయోడీజిల్ తయారు చేయడానికి 16 పక్షుల మృతకలేబరాలు అవసరమవుతాయి. దీనికి రూ.35.68 ఖర్చు అవుతుంది.

 పౌల్ట్రీ వ్యర్ధం    లాబొరేటరీలో బయో డీజిల్ తయారి

మంట పరీక్ష

ఈ విధముగా పౌల్ట్రీ వ్యర్ధాల నుండి తయారు చేసిన బయోడీజిల్ ఒక లీటరుకు రూ.22.00 ఖర్చు అవుతుంది. వాణిజ్యంగా వాడే డీజిల్ కు 20% బయోడీజిల్ కలపడం వల్ల 47.14 శాతం పొగని తగ్గించవచ్చు. దీని వల్ల డిసిల్ ఖర్చు తగ్గడంతోపాటు, ఇంజిన్ సామర్థ్యం పెరుగుతుంది అంతేకాక వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.

600 లీటర్ల ఉత్పాదక సామర్థ్యం గల బయో డీజిల్ యూనిట్



భారత దేశంలో పౌల్ట్రీ పరిశ్రామ సగటు ప్రామాణిక మరణాల అంచనా ప్రకారం చనిపోయే  పౌల్ట్రీ పక్షుల భరువు 2.4 టన్నులు. దీని నుండి 8500 టన్నుల బయోడీజిల్ తయారు చేయవచ్చు. 2లక్షల లీటర్ల బయోడీజిల్ ఉత్పత్తి చేసే ద్రావకం నుంచి సంగ్రహించే  ప్లాంట్ ని ఏర్పాటు చేయడానికి 2.5 కోట్లు ఖర్చు అవుతుంది. పౌల్ట్రీ వ్యర్ధాల నుండి తయారు చేసే బయోడీజిల్ రానున్న రోజులలో  దేశ ఇంధన సమస్యను తగ్గించడానికి, కాలుష్యరహిత ఇంధనాల కోసం, అంతరించిపోతున్న పెట్రో ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలున్నాయి. సరియైన పద్దతిలో పక్షుల మృత కలేబరాలు బయోడీజిల్ కు వాడినట్లయితే ఇక  పౌల్ట్రీ లో వ్యర్థాలు అన్న ప్రసక్తి ఉండది. అంతేకాక రానున్న రోజులలో పౌల్ట్రీ వ్యర్ధం అనేది కూడా పౌల్ట్రీ పరిశ్రమకు ఆదాయ వనరుగా మారవచ్చు.


·         డా.టి.పార్థసారథి 

·         డా.జె.రాజు 









National Livestock Mission

నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాలు రైతుల ఆదాయం పెంచేందుకు నిరుద్యోగులకు ఉపాధి ఏర్పరచాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ప...